Ay Pilla Song Lyrics in Telugu, Love Story Movie(2020)

Ay Pilla - Haricharan Lyrics




Singer Haricharan
Singer Pawan Ch
Music Pawan Ch
Song Writer Chaithanya Pingali



ఏయ్ పిల్లా పరుగున పోదామా
ఏ వైపో జంటగ ఉందామా
రా రా కంచె దుంకి
చక చక ఉరుకుతు
ఆ రంగుల విల్లుని తీసీ
ఈ వైపు వంతెన వేసీ రావా

ఎన్నో తలపులు
ఏవో కలతలు బతుకే పోరవుతున్నా
గాల్లో పతంగి మల్లె ఎగిరే కలలే నావి…
ఆశనిరాశల ఉయ్యాలాటలు పొద్దుమాపుల మధ్యే
నాకంటూ ఉందింతే ఉందంతా ఇక నీకే

నీతో ఇలా ఏ బెరుకు లేకుండా
నువ్వే ఇగా నా బతుకు అంటున్నా
నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానే తలగడగ
నీ తలను వాల్చి కళ్ళు తెరిచి
నా ఈ దునియా మిల మిల చూడే
వచ్చే మలుపులు
రస్తా వెలుగులు.. జారే చినుకుల జల్లే
పడుగూ పేకా మల్లె.. నిన్ను నన్ను అల్లే
పొద్దే తెలియక గల్లీ పొడుగున ఆడే పిల్లల హోరే
నాకంటూ ఉందింతే ఉందంతా ఇక నీకే

ఏయ్ పిల్లా పరుగున పోదామా
ఏ వైపో జంటగ ఉందామా

పారే నదై నా కలలు ఉన్నాయే
చేరే దరై ఓ వెదుకుతున్నాయే
నా గుండె ఓలి చేసి ఆచి తూచి అందించా జాతరల
ఆ క్షణము చాతి పైన సోలి చూశా లోకం మెరుపుల జాడే
నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి
నేలన కనిపిస్తుందే
మారే నీడలు గీసే
తేలే బొమ్మలు చూడే
పట్నం చేరిన పాలపుంతలు పల్లెల సంతలు బారే
నాకంటూ ఉందింతే ఉందంతా ఇక నీకే

Click Here To Watch👇

Aye Pilla Lyrics Full Video Song


Post a Comment