Tharagathi Gadhi Song Lyrics In Telugu, Colour Photo Movie (2020)

Tharagathi Gadhi Song - Kaala Bhairava





 
Singer Kaala Bhairava
Music Kaala Bhairava
Song Writer Kittu Vissapragada







తొలి పలుకులతోనే కరిగిన మనసు… చిరు చినుకుల లాగే జారే
గుసగుసలను వింటూ అలలుగ వయసు… పదపదమని తీరం చేరే

ఏ పనీపాట లేనీ… ఈ చల్ల గాలి
ఓ సగం చోటే కోరి… మీ కథే విందా



ఊరూ పేరూ లేని… ఊహా లోకానా
తారాతీరం దాటి… సాగిందా ప్రేమా

తరగతి గది దాటి… తరలిన కథకీ
తెలియని తెగువేదో చేరే… అడుగులు పడలేనీ తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరము పోయే……. నేడే

రాణే గీత దాటే… విధే మారే
తానే తోటమాలి… దరే చేరే
వెలుగూ నీడల్లే… కలిసే సాయంత్రం
రంగే లేకుండా… సాగే చదరంగం

సంద్రంలో నదిలా… జంటవ్వాలంటూ
రాసారో లేదో ఆ దేవుడు గారు…

తరగతి గది దాటి… తరలిన కథకీ
తెలియని తెగువేదో చేరే… అడుగులు పడలేనీ తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరము పోయే…….

Click Here To Watch👇

Tharagathi Gadhi Lyrical Video Song



Post a Comment