Peniviti - KAALA BHAIRAVA , Jr Ntr

Singer | KAALA BHAIRAVA |
Music | Thaman S |
Song Writer | RAMAJOGAYYA SASTRY |
నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో చూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా….
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా…
నలిగేటి నా మనసు గురుతొచ్చి రార
గలబోటి కూరొండి పిలిసినా రారా..
పెనిమీటి ఎన్ని నాల్లయినదో నినుజూసి కళ్లారా
ఎన్నెన్ని నాళ్ళయినదో నినుజూసి కళ్లారా …
చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతు సేసి పాడతాంది రార పెనిమీటి
గుండెనే గొంతు సేసి పాడతాంది రార పెనిమీటి
చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతు సేసి పాడతాంది రార పెనిమీటి
గుండెనే గొంతు సేసి పాడతాంది రార పెనిమీటి
పొలిమేరదాటి పోయావని
పొలమారిపోయే నీ దానిని
కొడవలి లాంటి నిన్నుసంటి వాడని
కొంగున దాచుకొనే ఆలి మనసునీ
సూసి సూడక సులకన సేయకు
నా తల రాతలో కలతలు రాయకు
తాళిబొట్టు తలుసుకొని
తరలి తరలి రార పెనిమిటి
హే…తాళిబొట్టు తలుసుకొని
తరలి తరలి రార పెనిమిటి
నరగోస తాకే కామందువే
నరగోస తాకే కామందువే
నలపూసవైనా కంటి కందవే
కటికి ఎండలలో కందిపోతివో
రగతపు సిందులతో తడిసి పోతివో
ఏలకు తింటివో ఎటనువ్వుంటివో
ఏట కత్తి తలగడై ఏడ పడుకుంటివో
నువ్వుగన్న నలుసునైనా
తలసి తలసి రార పెనిమిటి
హే … నువ్వుగన్న నలుసునైనా
తలసి తలసి రార పెనిమిటి
నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో చూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా….
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా…
పెనిమీటి ఎన్ని నాల్లయినదో నినుజూసి కళ్లారా
ఎన్నెన్ని నాళ్ళయినదో నినుజూసి కళ్లారా …
Post a Comment
Post a Comment